మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఏపీ శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో కేబినెట్ తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత తీర్మానం ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు.