ఇటీవలి కాలంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు థమన్. రీసెంట్‌గా ఆయన అల వైకుంఠపురములో చిత్రం కోసం స్వరపరచిన బాణీలు తెలుగు రాష్ట్రాలనే కాక దేశ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న థమన్ ఓ సూపర్ హిట్ సాంగ్‌ని రీమేక్ చేసే పనిలో పడ్డాడట.
థమన్ ఇప్పటికే చిరంజీవి సినిమాలలోని హిట్ సాంగ్స్‌ని తేజూ సినిమాల కోసం రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ- బోయపాటి సినిమా కోసం బాలయ్య నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంలోని ‘స్వాతిలో ముత్యమంత’ సాంగ్‌ని రీమిక్స్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆ పనులు మొదలయ్యాయని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. బోయపాటి శీను తెరకెక్కించనున్న ఈ చిత్రం మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్ళనుండగా, ఇందులో బాలయ్య అఘోరాగా కనిపిస్తారట. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ వారణాసిలో ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమాతో మళ్లీ ‘సింహా’, ‘లెజెండ్’ సక్సెస్‌ను రిపీట్ చేయాలని బోయపాటి చూస్తున్నారు.