కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా స్తంభించింది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడానికి సేనేటర్లు, వైట్‌హౌజ్ బృందం అంగీకరించింది. వ్యాపారవేత్తలకు, కార్మికులకు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్దీపన ప్యాకేజీ నుంచి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కరోనా వల్ల దెబ్బతిన్న వ్యాపారవర్గాలకు కూడా ఈ ప్యాకేజీ డబ్బు వెళ్తుంది. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు. ఆధునిక అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీ అని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక వ్యక్తికి ప్యాకేజీ కింద 1200 డాలర్లు ఇస్తారు. ప్రతి ఒక చిన్నారికి 500 డాలర్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం జరిగింది. అమెరికాలో జీవిస్తున్న దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు కూడా ప్యాకేజీ సొమ్ము చెల్లిస్తారు.
అమెరికా కొత్త చరిత్ర.. 2 ట్రిలియన్ల డాలర్ల ప్యాకేజీ