దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంతోనే ఒడిదుడుకుల మధ్య సాగినా.. చివరికి లాభాలతో ముగిసాయి. మొత్తానికి రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు పెరిగి 30,603 వద్ద ముగియగా.. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 8,993 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ రంగ షేర్ల భారీగా లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, వేదాంత, , హిందాల్కో టైటన్, సన్ ఫార్మ, ఐసీఐసీఐ, గెయిల్, లార్సెన్, నెస్లీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో నిలవగా.. హెచ్‌సిఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ , ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్, బజాజ్ ఆటో, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి.