కరోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులు, కళాకారులకు పలువురు ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సురభి డ్రామా గ్రూప్ సభ్యులకు నిత్యవసర సరుకులు అందజేశారు.
నా పేరు పద్మజా వర్మ. మా సురభి గ్రూప్ వాళ్లకు డైరెక్టర్ హరీష్ శంకర్ సరుకులు పంపణీ చేశారు. మా అందరికీ 81 బ్యాగులు అందాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా కళాకారులను ఆదుకున్నందుకు సురభి డ్రామ గ్రూప్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.